ఆసుపత్రుల్లో వైద్యులు, మెడికల్ సిబ్బంది సామాజిక మాధ్యమాల్లో రీల్స్ చేస్తూ వైరల్ కావడంపై తీవ్ర వివాదం చెలరేగింది. ఆసుపత్రి లాంటి సున్నితమైన ప్రదేశాల్లో, ముఖ్యంగా ఆపరేషన్ థియేటర్లు, రోగుల వార్డుల్లో రీల్స్ చిత్రీకరించడం రోగుల గోప్యత, ఆసుపత్రి క్రమశిక్షణపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇటీవల ఆదిలాబాద్ రిమ్స్‌లో డ్యూటీ సమయంలో మెడికోలు రీల్స్ చేస్తూ కనిపించడం ఈ చర్చకు దారితీసింది.

