అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరో కీలక మలుపు తిరిగాయి. హోర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో, ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమ జోలికొస్తే పర్షియన్ గల్ఫ్ రేవులను దిగ్బంధిస్తామని హెచ్చరించింది. అంతర్జాతీయ జలాల్లో నౌకల రవాణాపై ఆంక్షలు విధించడం సముద్రపు దొంగతనంతో సమానమని ఐఆర్జీసీ పేర్కొంది. దానికి తమ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది

