తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విషయంలో చెప్పేదేమీ లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు వ్యాఖ్యానించారు. కన్నవారికి మేలు చేయ “పోయినా ఫర్వాలేదు, పిల్లలు తండ్రిని సంతోష పెట్టకపోయినా ఫర్వాలేదు.. కానీ ఏడిపించవద్దని తెలిపారు. ఈ రాజకీయం ఉంటుంది, పోతుంది.. కానీ ఇతరులను బాధ పెట్టే తీరు మంచిది కాదని చెప్పుకొచ్చారు. రాజకీయ పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చని అన్నారు. ప్రజల ఆదరణ లేకుంటే వృథానే, ప్రజల కోణంలో పార్టీ పెడితే తప్పు లేదని వ్యాఖ్యానించారు.

