ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధం కారణంగా ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసేసింది. దీంతో ఇంధన లోటుతో పలు దేశాలు ఇబ్బందులు ఎదురుకుంటున్నాయి. తాజాగా హర్మూజ్ జలసంధిని తెరవాలని పలు దేశాలు ఇరాన్ను కోరాయి. దాడులను ఆపాలని కూడా ఇరాన్ను 22 సంయుక్త ప్రకటన చేశాయి. చమురు క్షేత్రాలు, వాణిజ్య నౌకలపై దాడులను పలు దేశాలు ఖండించాయి. యుఎఇ, బహ్రెయిన్, యుకె, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా సహా పలు దేశాలు ఈ దాడులను ఆపాలని విజ్ఞప్తి చేశాయి.

