దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి బ్రహ్మోత్సవాలకుముస్తాబైంది. రామక్షేత్రంలో అంకురార్పణ తో వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామనవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. దీంతో పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రామాలయం, కల్యాణమండపం పరిసరప్రాంతాలు చలువ పందిళ్లు చాందినీ వస్త్రాలతో అలంకరిస్తున్నారు. ఆలయానికి విద్యుద్దీపాలంకరణ చేపట్టడంతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది.మార్చి 27 న సీతారాముల కల్యాణం,28 న రాముడు పట్టాభిషేకం జరగనుంది.

