దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ జరిపిన భారీ క్షిపణి, డ్రోన్ దాడులతో విమానాశ్రయం లోపలి భాగంలో కొంత నిర్మాణానికి నష్టం వాటిల్లింది. ఈ సంఘటన కారణంగా నలుగురు విమానాశ్రయ ఉద్యోగులు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. విమానాశ్రయంలో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ వేగవంతం చేశారు. దుబాయ్ నగరానికి చిహ్నంగా నిలిచే ప్రపంచ ప్రసిద్ధ ఏడు నక్షత్రాల హోటల్ ‘బుర్జ్-అల్-అరబ్’పై కూడా ఇరాన్ డ్రోన్లతో దాడికి ప్రయత్నించింది. ఆకాశంలోనే డ్రోన్లను కూల్చివేసినా, వాటి శిథిలాలు పడటంతో హోటల్ ముఖభాగంలో మంటలు చెలరేగాయి.

