ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెరిటేజ్ సంస్థపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. రాజకీయ ప్రయోజనాల కోసం సంస్థ పేరును దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. తాను రాజకీయాల్లో ఉన్నందున ఎలాంటి వివాదాలు రాకూడదనే ఉద్దేశంతో దేవాలయాలకు పాలు, నెయ్యి సరఫరా చేయకుండా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇది పూర్తిగా పారదర్శకత కోసం తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు. ఇందాపూర్ వ్యవహారంలో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని సీఎం స్పష్టంగా తెలిపారు.

