కరీంనగర్ 58వ డివిజన్‌లోని జెడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన ఒక మహిళకు తాను ఇది వరకే ఓటు వేసినట్లు ఉందని పోలింగ్ సిబ్బంది చెప్పారు. దీంతో దొంగ ఓట్లు పడుతున్నాయని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పరస్పరం నినాదాలు చేసుకోవడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్థ పరిస్థితులు నెలకొన్నాయి. గొడవ కాస్తా తీవ్ర ఘర్షణకు దారి తీయడంతో ఆర్మీ, పోలీసుల బృందం రంగంలోకి దిగింది. లాఠీ చార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టగా.. పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి.

