సోమాలియాలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 55 మందితో ప్రయాణిస్తున్న విమానం మొగడిషు నుండి ప్రయాణం ప్రారంభించిన 15 నిమిషాల తర్వాత విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో పైలట్ వెంటనే విమానాన్ని తిరిగి వెనక్కి మళ్లించాడు. ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ కోసం ప్రయత్నించారు. అయితే విమానం ఎయిర్‌పోర్టులో కాకుండా… హిందూ మహాసముద్రంలోని బీచ్ తీరంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరూ మరణించకపోవడంతో… మిరాకిల్ జరిగినట్టుగా అంతా భావిస్తున్నారు. ఎవరికీ తీవ్రమైన గాయాలు కాలేదని చెబుతున్నారు

