కర్నాటకలో ముఖ్యమంత్రి పదవిలో డిప్యూటీ సిఎం శివకుమార్‌ను నియమించాలని కోరుతూ 80 మంది ఎంఎల్‌ఎలు హైకమాండ్‌కు లేఖ రాసినట్లు సమాచారం. ‘అవును. నిజమే 80 నుంచి 90 మంది శాసనసభ్యులం డికెకు అవకాశం ఇవ్వాలని అధిష్టానానికి లేఖ రాశాం. ఇక సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర పలుమార్లు చేస్తున్న ప్రకటనలు అయోమయానికి గురి చేస్తున్నాయి. ఏది ఏమైనా మేం క్రమశిక్షణగా మెలగాల్సిన అవసరం ఉంది. అధిష్టానం ఏం చెబితే దాన్ని పాటించాల్సి ఉంటుంది’ అని కాంగ్రెస్ ఎంఎల్‌ఎ ఇక్బాల్ మీడియాతో వ్యాఖ్యానించారు.

