భారత్ నిరంతరంగా 8 నుంచి 10 శాతం ఆర్థిక వృద్ధిని సాధించగలదని అవసరమైతే డబుల్ డిజిట్ వృద్ధిని కూడా దీర్ఘకాలంలో నిలకడగా కొనసాగించే సామర్థ్యం ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు. దేశ దీర్ఘకాలిక ఆర్థిక భవిష్యత్తుపై ఆయన ఆశావహ దృక్పథాన్ని వెల్లడించారు. ముంబైలో జరిగిన జియోబ్లాక్రాక్ కార్యక్రమంలో వ్యాఖ్యలు చేశారు. “భారత్ ప్రపంచాన్ని మించి వృద్ధి సాధిస్తుందని నేను భావిస్తున్నాను,” అని ఆయన అన్నారు.

