రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో ఇటీవల కలకలం రేపిన మహిళా న్యాయవాది స్వప్న హత్యోదంతంలో ఆస్తి కోసం ఒక తోడబుట్టిన అన్న ఇంతటి ఘాతుకానికి పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నిందితుడు రాజు, తన సోదరి స్వప్న మధ్య గత కొంతకాలంగా ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. స్వప్న తన వాటా కోసం కోరుతుండటంతో,ఆమెను అడ్డు తొలగించుకోవాలని ఇందుకోసం ఒక సుపారీ గ్యాంగ్ తో ఒప్పందం కుదుర్చుకొని కిరాయి హంతకులతో చంపించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

