టీం ఇండియా కొత్త స్పాన్సర్ హక్కులు ‘అపోలో టైర్స్’ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అపోలో టైర్స్ ఓ ప్రత్యేకమైన వీడియో విడుదల చేసింది. దీనికి ‘హర్ సఫర్ మే దమ్ హే’ అనే పేరు పెట్టింది. ఈ వీడియోలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, అర్ష్దీప్ సింగ్, శుభ్మాన్ గిల్లు భారత జెర్సీలతో కనిపించారు. టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఈ వీడియోలో తళుక్కమన్నారు.

