ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో- ఎయిర్ ఇండియా విమానాల రెక్కలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ల్యాండింగ్ సమయంలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుండి ముంబైకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం రెక్కలు ముంబై నుండి కోయంబత్తూర్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం రెక్కలను ఢీకొన్నాయి. సంఘటన జరిగిన సమయంలో రెండు విమానాలలో ప్రయాణికులు ఉన్నారు. రెండు రెక్కలు స్వల్పంగా ఢీకొనడంతో విమానాల్లో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

