బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆ దేశ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. అవినీతి కేసుల్లో ఆమెకు ఏకంగా 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ ఢాకాలోని ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. రాజధానిలోని పూర్బాచల్ న్యూటౌన్ ప్రాజెక్టులో ప్లాట్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని హసీనాపై అభియోగాలు ఉన్నాయి. రెండు వేర్వేరు కేసుల్లో ఆమెకు చెరో ఐదేళ్ల చొప్పున మెుత్తం పదేళ్ల శిక్ష ఖరారు చేశారు. ఈ కేసుల్లో హసీనా కుటుంబ సభ్యులను కుడా దోషులుగా చేర్చారు.

