సూర్యాపేట జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు భగ్గుమంటున్నది. మున్సిపల్ ఎన్నికలు సమీస్తున్న కొద్దీ ఆ పార్టీలో అసంతృప్త నేతలు తిరుగుబావుటాను ఎగరవేస్తున్నారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 25వ వార్డులో కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకుడు కోడి శివ యాదవ్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడ్డాడు. గత మున్సిపల్ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్లకు ఇస్తే సపోర్ట్ చేశామన్నారు. కానీ, ప్రస్తుతం తనకు ఇవ్వాల్సి ఉండగా అలా కాకుండా రమేష్ రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

