2026-27 కేంద్ర బడ్జెట్ మీద ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. “ఎన్డీఏలో చంద్రబాబు కీలకంగా ఉన్నా.. రాష్ట్రానికి ప్రయోజనం గుండు సున్నా. బాబు గారి అండతో ప్రధానిగా నిలబడిన మోదీ.. ప్రతి సారి బడ్జెట్లో మనకు చేస్తున్నది ఘరానా మోసమే. 50 లక్షల కోట్ల బడ్జెట్లో ఈ సారి సైతం రాష్ట్రానికి మొండి చెయ్యే. ఇంత జరుగుతున్నా కూడా సీఎం చంద్రబాబు నాయుడు నోరు మెదపటం లేదని విమర్శించారు.

