చంద్రబాబు సర్కార్ పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ‘ప్రజాస్వామ్యంలో మీరు చేసిన తప్పుడు ఆరోపణలు తప్పు అని.. ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబ్ లు ఎన్ఎబీ, ఎన్టీఆర్ నిర్ధారణ చేశాయి. మీరు చేసిన తప్పులకు మిమ్మల్ని ప్రశ్నిస్తే.. ఇళ్లకు మీరు నిప్పు పెట్టడం, ఆ దుశ్చర్యలతో భయాన్ని కలిగించానని మీరు అనుకోవడం.. చంద్రబాబూ అది మీ భ్రమే. ఆ నిప్పు మీ ప్రభుత్వానికి మీరు పెట్టుకున్నారని గుర్తుంచుకోవాలి చంద్రబాబూ” అంటూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ హెచ్చరించారు.

