సినీ నటుడు రామ్ చరణ్ దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చారు. దీంతో మెగా కుటుంబం ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఉపాసన మగ, ఆడ శిశువులకు జన్మనిచ్చారని మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్లో పోస్టు చేశారు. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని, తన కుటుంబంలోకి కొత్త సభ్యులు రావడం అనేది తాత నానమ్మలుగా మాకు చాలా ఆనందంగా ఉందని, ఇది దేవుడు ఇచ్చిన ఆశీర్వాదమని తెలిపారు.

