మాజీమంత్రి అంబటి రాంబాబుపై జనసేన పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశిస్తూ చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలపై, అసభ్యకర బూతులపై కఠినంగా చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి పోలీసులు అరెస్ట్ చేయాలి… భవిష్యత్తులో ఇలా మరే ఇతర నాయకుడు ప్రవర్తించకుండా న్యాయస్థానం కఠినంగా శిక్షించాలి అని జనసేన పార్టీ డిమాండ్ చేసింది.

