అంబటి రాంబాబు దీనిపై స్పందించారు. చట్టవ్యతిరేకంగా మాజీ సీఎం ఫ్లెక్సీని ఏర్పాటు చేశారని, ఆ ఫ్లెక్సీని చించడానికి తాను వెళ్లలేదని తెలిపారు. తాను చంద్రబాబును తిట్టినట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అంబటి రాంబాబు పేర్కొన్నారు. తనపై కొందరు దాడి చేసేందుకు ప్రయత్నించడంతో ఆవేశంలో కొందరిపై నోరు జారానని వివరించారు. అయితే వారిని ఉద్దేశించి కూడా అలా మాట్లాడి ఉండాల్సింది కాదన్నారు. చంద్రబాబును తిట్టాననే ఆరోపణలతో తనను అరెస్ట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోందని అంబటి రాంబాబు ఆరోపించారు. అరెస్ట్లకు భయపడేది లేదన్నారు.

