ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించి మరో 30 వేల పేజీల డాక్యుమెంట్లను అమెరికా న్యాయశాఖ విడుదల చేసింది. వాటితో పాటు 2వేలకు పైగా వీడియోలు, సుమారు 1.80 లక్షల ఫొటోలను కూడా విడుదల చేసింది. ఈ విడుదల గతేడాది కాంగ్రెస్ ఆమోదించిన పారదర్శకత ఆదేశాల మేరకే ఈ ఫైల్స్ విడుదల చేశాం అని, బాధిత యువతుల ఫొటోలు, పేర్లు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని డిప్యూటీ అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచ్ వెల్లడించారు

