ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం కాన్ఫిడెంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు ,ఛైర్మన్ సి.జె. రాయ్ బెంగళూరులోని తన కార్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన పారిశ్రామిక వేత్తలను దిగ్భ్రాంతికి గురిచేసింది. సి.జె. రాయ్ ఆత్మహత్యకు కొన్ని రోజుల ముందు, జనవరి 27న ఆయన నివాసం , కాన్ఫిడెంట్ గ్రూప్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. .సి.జె. రాయ్ దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా కేరళ , కర్ణాటక రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో చెరగని ముద్ర వేశారు.

