సినీ పరిశ్రమలో ‘కాస్టింగ్ కౌచ్’ అనేది లేదని మెగాస్టార్ కామెంట్స్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. కాస్టింగ్ కౌచ్ లేదన్న చిరంజీవి వ్యాఖ్యలను విభేదించారు సింగర్ చిన్మయి. కాస్టింగ్ కౌచ్ అనేది అదుపులో లేని సమస్య. కమిట్మెంట్ కు నో చెబితే రోల్స్ ఇవ్వరు. చిరంజీవి జనరేషన్లో మహిళా ఆర్టిస్టులను గౌరవించేవారు. ఇక్కడ పని ఇచ్చినందుకు బదులుగా సె*క్స్ కోరుకుంటారు. అలాంటి పురుషుల ఆలోచనా ధోరణే పెద్ద సమస్య అంటూ ట్విట్ చేశారు చిన్మయి. ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

