భారత టెన్నిస్ కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన విజయ్ అమృత్‌రాజ్‌కు గౌరవప్రదమైన ‘పద్మభూషణ్’ లభించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ‘పద్మశ్రీ’ వరించింది. అంతర్జాతీయ క్రికెట్లో అనేక రికార్డులు సృష్టించిన రోహిత్, 2024లో భారత్‌కు టీ20 ప్రపంచకప్ అందించి దేశం గర్వపడేలా చేశారు. మహిళా క్రికెట్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ‘పద్మశ్రీ’కి ఎంపికయ్యారు.ఆమెతో పాటు హాకీ గోల్‌కీపర్ సవితా పునియా, వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఫుట్‌బాల్ దిగ్గజం ఐ.ఎం. విజయన్‌లకు కూడా పద్మశ్రీ దక్కింది.

