భారత సంతతికి చెందిన ప్రసిద్ధ అంతరిక్ష యాత్రికురాలు సునీతా విలియమ్స్ నాసా నుండి రిటైర్ అవ్వడం ద్వారా అంతరిక్ష విజ్ఞానంలో ఒక చారిత్రక అధ్యాయం ముగిసింది. దాదాపు 27 సంవత్సరాల పాటు అమెరికాకు చెందిన పరిశోధనా సంస్థ నాసాలో పనిచేసిన తరువాత, ఆమె అంతరిక్ష కెరీర్ ముగించారు. పదవీ విరమణకు ముందు సునీతా విలియమ్స్ నాసా అత్యంత సీనియర్ వేతన స్థాయి GS-15 లో పనిచేశారు. ఆమె సంవత్సరానికి దాదాపు 1.20 నుండి 1.30 కోట్ల రూపాయల వరకు జీతం పొందేవారు.

