భారత్కు చెందిన అదానీ సోలార్ ప్రఖ్యాత అరుదైన ఘనత సాధించింది. ప్రపంచ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి విభాగంలో ప్రఖ్యాత వుడ్ మెకెంజీ ర్యాకింగ్స్లో చోటు దక్కించుకుంది. అదానీ న్యూ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు సంబంధించిన అదానీ సోలార్కు గ్రేడ్ Aతో ప్రపంచవ్యాప్తంగా 8వ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా సోలార్ మాడ్యూల్ తయారీదారులనను పరిశీలించి ర్యాంకింగ్ ఇవ్వగా, అందులో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ కంపెనీగా అదానీ సోలార్ నిలిచింది.

