సూరత్‌లో చంద్రశేఖర్ ఆజాద్ ఫ్లైఓవర్ (జిలానీ బ్రిడ్జ్) పై నుంచి రెహాన్ షేక్ అనే వ్యక్తి తన భార్య రెహానా, కూతురు ఆయిషా(7)తో కలిసి బైక్‌పై బయలుదేరారు. అంతలోనే రెహాన్ మెడకు గాలిపటం మాంజా చుట్టుకోవడంతో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో రెహాన్ అతని కూతురు ఆయోషా అక్కడికక్కడే మృతి చెందారు. అతని భార్య రెహానా 70 అడుగుల ఎత్తు నుంచి ఫ్లైఓవర్ కింద ఉన్న ఆటో రిక్షాపై పడింది. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ రెహానా మృతి చెందింది.

