టాలీవుడ్ యాక్టర్ బాలకృష్ణ ‘అఖండ 2: తాండవం’ ఈ రోజు (డిసెంబర్ 4) భారత్లో జరగాల్సిన స్పెషల్ ప్రీమియర్ షోలను రద్దు చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. సాంకేతిక సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మా వంతు మేం ఎంతగానో ప్రయత్నించాం, కానీ కొన్ని అంశాలు మా నియంత్రణలో ఉండవు. అసౌకర్యానికి క్షమించండి” అని పోస్టులో పేర్కొంది. అయితే, ఓవర్సీస్లో మాత్రం ప్రీమియర్ షోలు యథావిధిగా షెడ్యూల్ ప్రకారమే ప్రదర్శితమవుతాయని స్పష్టం చేసింది.

