సిడ్నీలోని హోర్న్స్బీ శివారులో జరిగిన ఘోర ప్రమాదంలో 33 ఏళ్ల భారత సంతతికి చెందిన మహిళ మృతిచెందారు. ఆమె 8 నెలల గర్భిణి అని, ప్రమాదంలో కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోయిందని 9 న్యూస్ రిపోర్ట్ చేసింది. శుక్రవారం నాడు తన భర్త, మూడేళ్ల కుమారుడితో కలిసి నడుచుకుంటూ వెళుతుండగా ఆమెను కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. కొన్ని రోజుల్లోనే రెండవ బిడ్డ పుడుతుందని సంతోషంగా ఉన్న సమయంలో కుటుంబంలో విషాదం నెలకొంది

