బిహార్ తొలి విడత సమరానికి రంగం సిద్ధమైంది. 243 స్థానాలకుగాను తొలి దశలో 121 నియోజకవర్గాలకు గురువారం ఓటింగ్ జరగనుంది. తొలి విడతలో 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 3.75కోట్ల ఓటు వేయనున్నారు. అందులో 122 మంది మహిళా అభ్యర్థులు కాగా జన్ సురాజ్ పార్టీ తరఫున ఓ ట్రాన్స్‌జెండర్ కూడా బరిలో ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం 45వేల 341పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అందులో 36వేల 733 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. 10.72లక్షల మంది తొలిసారి ఓటు వేయనున్నారు.

