భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశాయి. బీఆర్ఎస్ ఆఫీసులోని ఫర్నిచర్ బయటకు తీసుకువచ్చి నిప్పుపెట్టారు. దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఆఫీసు ఆవరణలో ఉన్న పార్టీ నేతల ఫ్లెక్సీలు, బ్యానర్లు చించివేశి కాంగ్రెస్ కార్యకర్తలు వీరంగం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు వద్ద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేశారు. ఫెక్సీలు, ఫర్నిచర్ కు నిప్పుపెట్టడంతో చుట్టుపక్కల ఇండ్లలో షార్ట్ సర్క్యూట్ అయినట్లు సమాచారం.

