కూటమి ప్రభుత్వంపై.. మాజీ సీఎం, వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోసాలతో అక్క చెల్లెమ్మలకూ వెన్నుపోటు పొడిచారని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తమ పాలనలో మహిళలకు కోట్ల రూపాయలు అందిస్తే.. ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ వారిని పేదరికంలోకి నెట్టిందని ఆరోపించారు. మొత్తం 16 రకాల బస్సులో 5 రకాల బస్సుల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం, 1,560 ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 950 నాన్‌స్టాప్ బస్సులు ఉన్నాయని.. వాటిలో ఉచిత ప్రయాణం లేదంటూ బోర్డులు పెట్టడం మహిళలను మోసం చేయడమేనని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

