ఏపీలోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం కొత్తగా ఏడు ఐఐటీ, నీట్ కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదివి.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఐఐటీ-నీట్ సెంటర్లలో కోచింగ్ తీసుకుని.. ఈ ఏడాది జరిగిన ఐఐటీ, నిట్, నీట్ పరీక్షల్లో సత్తా చాటిన విద్యార్థులను చంద్రబాబు అభినందించారు. 55 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులు సోమవారం రోజున సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. పరీక్షల సన్నద్ధత కోసం రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు.

