స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి ప్రోటోకాల్ వివాదం వెనుక ఉన్న అసలు కారణాన్ని వివరించారు. శుక్రవారం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమానికి తాను అధికారుల ఆహ్వానం మేరకు హాజరైనట్లు తెలిపారు. అయితే, తనకు కేటాయించిన ప్రదేశంలో అప్పటికే కొంతమంది అతిథులు కూర్చుని ఉన్నారని, వారు అక్కడి అధికారుల కుటుంబ సభ్యులేనని ఆమె గుర్తించారు. వారిని అక్కడి నుంచి లేపి తాను కూర్చోవడం సంస్కారం కాదని భావించి, కార్యక్రమం పూర్తయ్యే వరకు నిలబడే ఉన్నానని ఆమె పేర్కొన్నారు.

