మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీ ని గృహనిర్బంధంలోకి తరలించారు. ఈ విషయాన్ని ఆ దేశ మీడియా వెల్లడించింది. 80 ఏళ్ల నోబెల్ గ్రహీత సూకీ చాన్నాళ్ల నుంచి జైలులో ఉన్నారు. దేశరాజధాని నైపియితాలో ఉన్న జైల్లో ఆమెను ఇన్నాళ్లూ నిర్బంధించారు. 2021లో మిలిటరీ తిరుగుబాటు తర్వాత ఆమెను కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే శిక్షాకాలంలోని మిగితా సమయాన్ని సూకీ తన ఇంటిలోనే గడపనున్నట్లు మిలిటరీ నేత మిన్ ఆంగ్ హయింగ్ ఓ ప్రకటనలో తెలిపారు.

