గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఓ మహిళతో మాట్లాడిన వీడియో వైరల్గా మారింది. ఒక మహిళతో ఎమ్మెల్యేతో వీడియోలో సైగలు చేస్తూ కనిపించారు. ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ తన కార్యాలయంలో ఉండగా.. సదరు మహిళ రైలులో ప్రయాణిస్తుండగా వీడియో కాల్చేసి మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది నసీర్ వీడియో కాల్లో ఏం మాట్లాడారన్నది క్లారిటీ లేదు. ఆమె గతంలో టీడీపీ కార్పొరేటర్ పదవికి పోటీ చేసిన మహిళ అంటూ ప్రచారం జరుగుతోంది.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తీరుపై విమర్శలు చేస్తోంది.

