ఫిడే మహిళల వరల్డ్ కప్ ఛాంపియన్ దివ్య దేశ్‌ముఖ్ పేరు ప్రస్తుతం దేశమంతా మార్మోగిపోతోంది. 19 ఏళ్లకే భారత గ్రాండ్‌మాస్టర్‌గా రికార్డు సృష్టించిన దివ్య..మహారాష్ట్రలోని నాగ్‌పూర్ దివ్య సొంతూరు. ఆమె తల్లిదండ్రులు జితేంద్ర దేశ్‌ముఖ్,
నమ్రతా దేశ్‌ముఖ్ ఇద్దరూ డాక్టర్లే. దివ్య 4-5 సంవత్సరాల వయస్సులో చెస్‌తో పరిచయం ఏర్పడింది. అక్క బ్యాడ్మింటన్ నేర్చుకోవడానికి వెళ్లినప్పుడు, ఆమెతో వెళ్లిన దివ్య చెస్ క్లాస్‌లో చేరింది. అయిష్టంగానే ఉంటూ చెస్ క్లాస్‌లలో నిద్రపోయేది. తల్లిదండ్రుల ప్రోత్సాహం,మొదటి కోచ్ రాహుల్ జోషీ ప్రోత్సాహంతో ఆటపై ఆసక్తి పెరిగింది. దివ్య 7 ఏళ్ల వయసులో జాతీయ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకుంది 2021లో దివ్య భారతదేశ 21వ ఉమన్ గ్రాండ్‌మాస్టర్(WGM) అయింది. దివ్య 10 సంవత్సరాల వయస్సులోనే అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఆమె 40 సార్లు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి, 35 పోడియం ఫినిష్‌లు సాధించింది.

