ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రంపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ నాగబాబు మండిపడ్డారు. ఇది చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీని, ఆ నేతలను ఏమనాలో అర్థం కావడం లేదని తెలిపారు. వైసీపీ అరాచకాలపై పోరాటం చేయాలని జనసేన కార్యకర్తలకు సూచించారు. మంత్రి పదవిపై నాగబాబు స్పందిస్తూ.. తనకు పదవులపై ఆశ లేదని తెలిపారు. జనసేన కార్యకర్తగా ఉండటమే తనకు ఇష్టమని స్పష్టం చేశారు.

