ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో కీలక సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల నిర్ణయానికి ఆమోదం తెలిపింది. త్వరలోనే దీనిపై ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేయనుందని సమాచారం. దీని కోసం ఇప్పటికే అసెంబ్లీని గవర్నర్ ప్రోరోగ్ చేసినట్టు తెలుస్తోంది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది.

