అమెరికాలోని లాస్ ఎంజిలెస్ ప్రాంతంలో 31 మంది నిర్మాణ కార్మికులకు గండం గడిచింది. ఇండస్ట్రియల్ టన్నెల్నిర్మాణ పనులలో ఉన్న వీరిపై పై కప్పు కొంతభాగం కూలింది. ఏకైక మార్గం గుండానే కార్మికులు లోపలికి వెళ్లుతారు. తొమ్మిది కిలోమీటర్ల లోపల కార్మికులు పనుల్లో ఉండగా ప్రమాదం జరిగింది. పూర్తిగా బురదమయంగా ఉన్న నేలపై నుంచే కార్మికులు అష్ఠకప్టాలు పడి ముందుకు ముఖద్వారం వద్దకు చేరుకున్నారు. వెంటనే వీరిని సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

