కెనడా మానిటోబాలో రెండు శిక్షణ విమానాలు గాల్లో ఢీ కొన్నాయి శిక్షణ సమయంలో రెండు సింగిల్ ఇంజిన్ విమానాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువ పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన పైలట్లలో కేరళకు చెందిన 23 ఏళ్ల విద్యార్థి శ్రీహరి సుకేశ్గా వెల్లడించింది. టేకాఫ్, ల్యాండింగ్లను ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు శిక్షణ స్కూల్ అధ్యక్షుడు ఆడమ్ పెన్నర్ తెలిపారు. ఒకే సమయంలో ల్యాండ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు.

