ఏపీ బీజేపీ అధ్యక్షుడు లోకేష్‌కి అందజేసిన భారతదేశ మ్యాప్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వేర్వేరు రాష్ట్రాలుగా విభజించి లేవని. ఆంధ్రప్రదేశ్‌ని ఉమ్మడి రాష్ట్రంగానే చూపిస్తున్నట్లుగా ఉండటాన్ని తప్పుపట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈఫోటోని తన సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేస్తూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణపై బీజేపీ ప్రభుత్వానికి, ఆపార్టీకి ఉన్న చిత్తశుద్దిని శంకిస్తూ కొన్ని అంశాలను ప్రస్తావించారు. బీజేపీ చీఫ్ అందజేసిన చిత్రపటంపై తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

