ట్రంప్ నుంచి మరో ఆసక్తికర ప్రకటన వచ్చింది. అదే.. పాలన మార్పు గురించి. ప్రస్తుతం అయతుల్లా అలీ ఖమేనీ కనుసన్నల్లో ఇరాన్ పాలన సాగుతుంది. ‘పాలన మార్పు’ అనే పదాన్ని ఉపయోగించడం రాజకీయంగా సరైనది కాదు, కానీ ప్రస్తుత ఇరాన్ పాలన ఇరాన్ను మళ్లీ గొప్పగా చేయలేకపోతే, పాలన మార్పు ఎందుకు జరగదు?” అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో MIGA (మేక్ ఇరాన్ గ్రేట్ ఎగైన్) నినాదాన్ని ఉద్ఘాటిస్తూ పేర్కొన్నారు

