రైతులకు కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రత్యేక కార్డులను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తుంది. దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించారు. రైతుల యెక్క విశిష్ట గుర్తింపు కార్డులో ఆధార్ నంబర్‌తో లింకైన పట్టాదారు పాసు పుస్తకంలోని భూమి వివరాలను నమోదు చేస్తారు, వీటి ఆధారంగా ఒక ప్రత్యేకమైన నంబర్ కేటాయిస్తారు . రైతుల నమోదు (ఫార్మర్ రిజిస్ట్రీ) తెలంగాణలో ప్రారంభమైంది. రైతుల కోసం ప్రవేశ పెట్టిన పథకాలు సకాలంలో అందటంలేదని, వీటికి పరిష్కారంగా విశిష్ట గుర్తింపు సంఖ్యతో ప్రత్యేక కార్డులు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

