పవన్ కళ్యాణ్ ఎంట్రీతో సీటు త్యాగం చేసిన వర్మ కు సొంత పార్టీ షాకిచ్చింది. ఇవాళ ఆయన్ను పిఠాపురం టీడీపీ ఇన్ ఛార్జ్ పదవి నుంచి తప్పిస్తూ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో వర్మ తన అభిప్రాయాలు చెప్పేందుకు ప్రయత్నించారు. అయితే హైకమాండ్ తీసుకున్న నిర్ణయం మాత్రం ఆయన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. దీంతో ఉబికి వస్తున్న కన్నీళ్లతో కాసేపు మాట్లాడిన వర్మ.. ఉన్నట్లుండి లేచి వెళ్లిపోయారు.