ఏపీలో తరచూ వైద్య విధులకు గైర్హాజరవుతున్న 70 మంది వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్వాసన పలికింది. వీరేకాక, వివిధ దశల్లో మరో 193 మంది పైనా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. డీఎస్ హెచ్ఎస్, డీఎంఈ అధికారులు తయారుచేసిన నివేదికను మంత్రి సత్యకుమార్కు అందజేశారు. గత మే నెలలోనే డీఎంఈ పరిధిలో 51 మంది వైద్యులను తొలగించారు. ఈసందర్భంగా గైర్హాజరుపై ఉపేక్షించవద్దని అధికారులకు మంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో సుదీర్ఘకాలంగా అనధికారికంగా గైర్హాజరవుతున్న వైద్యులపై ప్రభుత్వం వేటు వేసింది.