కరువు సీమ సిరుల సీమ అవుతుందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పండ్లు, కూరగాయలు, పూలు పండించే ప్రాంతం రాయలసీమ మాత్రమే అని అన్నారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరువు సీమలో గొప్ప కార్యక్రమం చేపట్టామని, రూ. లక్ష కోట్లతో రాయలసీమను గ్లోబల్ హార్డికల్చర్ హబ్ గా తయారు చేస్తామని తెలియజేశారు. ప్రకృతి సేద్యంలో ఎపి మొదటి స్థానంలో ఉందని, సాగునీరు ఇస్తే సీమ రైతులు బంగారం పండిస్తారని చంద్రబాబు కొనియాడారు.