ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు. ‘హౌసింగ్ ఫర్ ఆల్’ కార్యక్రమాన్ని సాచురేషన్ విధానంలో అమలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. 2027 మార్చి నాటికి 5.52 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని గడువు నిర్దేశించారు. పట్టణ ప్రాంతాల్లో 1.5 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఆయన కోరారు. డిసెంబరు 2026 నాటికి 2.05 లక్షల ఇళ్లు, 2027 మార్చి నాటికి మరో 2.74 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలనే ఆదేశాలు ఇచ్చారు.