loader

అందుబాటులోకి దేశంలోనే తొలి డెంగ్యూ నివారణ వ్యాక్సిన్

భారత్‌లో తొలి డెంగ్యూ నివారణ వ్యాక్సిన్ ‘క్యూడెంగా’ విడుదలకు  కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చింది. ప్రముఖ జపానీస్‌ ఔషధ తయారీ సంస్థ ‘తకేడా’ ఈ టీకాను అభివృద్ధి చేసింది. 4 నుంచి 60 ఏళ్ల వయసు గల వారు ఈ వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులని కంపెనీ తెలిపింది. గతంలో డెంగ్యూ సోకిందా లేదా అనే విషయంతో సంబంధం లేకుండా, ఏ ముందస్తు రక్తపరీక్షలు లేకుండా దీనిని వేయించుకోవచ్చు. 3 నెలల వ్యవధిలో 2 డోసులుగా ఈ వ్యాక్సిన్‌ను ఇవ్వాల్సి […]

సీజేపీ ఆందోళ‌న‌లు.. అమిత్ షాతో ధ‌ర్మేంద్ర భేటీ!

కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంట్ ముట్టడి వేళ కేంద్ర హోం శాఖ మంత్రి అమితాతో విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీజేపీ ఆందోళనతో పార్లమెంట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పేపర్ లీకులకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు పార్లమెంట్ లోపల విపక్షాలు సైతం పేపర్ లీకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై చర్చ జరగాలని పట్టుబడుతున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ […]

నిరాహార దీక్షను విరమించిన CJP ఫౌండర్- జేపీ నడ్డాతో చర్చలు

పరీక్షల సంస్కరణలు, విద్యా వ్యవస్థలో మార్పుల కోసం చేపట్టిన ఆందోళనలో కీలక పరిణామం జరిగింది. కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తన నిరవధిక నిరాహార దీక్షను సోమవారం విరమించారు. ప్రస్తుతం దిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ చేసిన విజ్ఞప్తి మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా, సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకా కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాతో సమావేశం […]

త్రిపుర డీజీపీ అనురాగ్​ ధన్​ఖడ్​ అనుమానాస్పద మృతి

త్రిపుర డీజీపీ అనురాగ్‌ ధన్‌ఖడ్‌ అనుమానాస్పద స్థితిలో సోమవారం మృతి చెందారు. అగర్తలాలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో సోమవారం ఆయన గన్‌తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. ఆయనను గమనించిన సిబ్బంది వెంటనే అగర్తలాలోని గోవింద్ బల్లభ్ పంత్ ఆసుపత్రికి తరలించారు. పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఆయన మరణానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై పోలీసులు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం!

హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీ లో తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక దాడి, తీవ్ర వేధింపులకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో ఎస్సార్ నగర్ పరిధిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. విచారణలో భాగంగా ఈ ఆరోపణలపై 8 రోజుల్లోగా పూర్తి వివరణ ఇవ్వాలంటూ ఉదయ్‌కి పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.

పార్ల‌మెంట్ స‌మావేశాల వేళ ‘రాహుల్ వీడియో’ క‌ల‌క‌లం!

రాహుల్ గాంధీ ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేస్తున్నారంటూ ముగ్గురు పిల్లలు, మరో మహిళతో ఉన్న ఓ వీడియోను పార్లమెంట్ సమావేశాల వేళ నెటిజన్లు తెగ వైరల్ చేసేస్తున్నారు. వీడియోలో తప్పేముందని, లేనిపోని అవాస్తవాలు ఆరోపణలను ప్రచారం చేయవద్దని కొట్టిపారేస్తున్నారు. మరికొంత మంది ఈ వీడియోలో ఉన్నది రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన ఒక స్నేహితుడి కుటుంబానికి చెందిన వారని చెప్తున్నారు

మహారాష్ట్రలో ట్రక్కు-కారు ఢీకొని ఐదుగురు దుర్మరణం

మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై వేగంగా వచ్చిన ఒక ట్రక్కు, కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ఇథనాల్‌ లోడ్‌తో వెళ్తున్న ఒక కంటైనర్ ట్రక్కు అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. సరిగ్గా అదే సమయంలో రోడ్డుపై ఆగి ఉన్న కారును, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన మరో ట్రక్కు బలంగా ఢీకొట్టడంతో ఈ ఘోర విషాదం చోటుచేసుకుంది.

ఢిల్లీలో హైటెన్షన్.. ‘కాక్రోచ్’ కార్యకర్తలపై లాఠీఛార్జ్

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన చలోపార్లమెంట్ పై పోలీసులు, భద్రతా దళాలు లాఠీ ఝులిపించారు. పోలీసులు ఆదేశాలు బేఖాతరు చేస్తూ కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున జంతర్ మంతర్ నుంచి ర్యాలీగా బయలుదేరారు.అప్పటికే భారీగా మోహరించిన భద్రతా దళాలు లాఠీలతో కాక్రోచ్ పార్టీ మద్దతుదారులపై విరుచుకుపడ్డారు.

కొట్టుకున్న స్పెయిన్-అర్జెంటీనా ఆటగాళ్లు..

మ్యాచ్ ముగింపుకు రిఫరీ తుది విజిల్ ఊదిన వెంటనే, పరేడెస్ కోపంతో స్పానిష్ ఆటగాళ్ల వైపు పరుగెత్తాడు. టచ్‌లైన్ సమీపంలో ఇరు జట్ల మధ్య ఘర్షణతో రణరంగంగా మారడం. ఈ ఘర్షణలో, పరేడెస్ మరింత దూకుడుగా మారి, యువ స్పానిష్ మిడ్‌ఫీల్డర్ గావి మెడను పట్టుకున్నాడు అర్జెంటీనా.. స్పెయిన్ ఆటగాళ్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. మైదానంలో ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకున్నారు. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు

అర్జెంటీనాపై స్పెయిన్ ఘనవిజయం

ఫుట్‌బాల్ ప్రపంచంలో కొత్త రాజు సింహాసనాన్ని అధిష్టించాడు. న్యూయార్క్ న్యూజెర్సీ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ పోరులో 1-0 తేడాతో అర్జెంటీనాపై విజయం సాధించి స్పెయిన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 2010లో సౌతాఫ్రికాలో తొలిసారి వరల్డ్ కప్ గెలుచుకున్న స్పెయిన్ జట్టుకు.. ఇది రెండో ప్రపంచకప్ కావడం విశేషం. ఈ టోర్నమెంట్‌లో లూయిస్ డి లా ఫ్యూయెంటె శిక్షణలోని స్పెయిన్ జట్టు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా అజేయంగా నిలిచి కప్‌ను కైవసం […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON